తెలంగాణ

telangana

ETV Bharat / international

కరీబియన్​ దీవుల్లో భూకంపం-సునామీ హెచ్చరిక - అంతర్జాతీయ వార్తలు తెలుగు

కరీబియన్​ దీవుల్లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. జమైకా, క్యూబా, కేమన్​ దీవుల మధ్య సముద్రంలో భూకంపం రావటం వల్ల సునామీ హెచ్చరికలు చేసింది అంతర్జాతీయ సునామీ కేంద్రం.

quake
quake

By

Published : Jan 29, 2020, 9:01 AM IST

Updated : Feb 28, 2020, 9:06 AM IST

కరీబియన్‌ దీవుల్లో భూకంపం సంభవించింది. జమైకా, క్యూబా, కేమన్‌ దీవుల మధ్య సముద్రంలో 10 కి.మీ దూరంలో భూకంపకేంద్రం ఉన్నట్లు గుర్తించారు. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 7.7గా నమోదైంది.

ఈ నేపథ్యంలో క్యూబా, జమైకా, కేమన్‌ దీవులకు యునైటెడ్‌ స్టేట్స్‌ జియోలాజికల్‌ సర్వే(యూఎస్‌జీఎస్‌), అంతర్జాతీయ సునామీ కేంద్రం సునామీ హెచ్చరికలు జారీ చేశాయి. భూకంప తీవ్రతకు దీవుల్లోని పలు భవనాలు కదిలాయి. ఇంతవరకు ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు.

భూకంప కేంద్రంగా సముద్ర తీర ప్రాంతాల్లో 300కి.మీ వరకు సునామీ తరంగాలు వస్తున్నాయని పసిఫిక్‌ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. సునామీ ప్రభావం క్యూబా, హోండురస్‌, మెక్సికో, కేమన్‌ దీవులు, బెలిజ్‌, జమైకాలోని పలు ప్రాంతాల్లో ఉండనున్నట్లు పేర్కొంది. తీర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేమన్‌ ప్రభుత్వం తెలిపింది.

Last Updated : Feb 28, 2020, 9:06 AM IST

ABOUT THE AUTHOR

...view details