Gandhi statue vandalised: అమెరికాలో మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. న్యూయార్క్‌లో జరిగిన ఈ ఘటనను అక్కడ నివసిస్తున్న భారతీయులతో పాటు భారత కాన్సులేట్ జనరల్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మహాత్మ 117వ జయంతిని పురస్కరించుకుని గాంధీ స్మారక అంతర్జాతీయ ఫౌండేషన్ దీనిని బహుకరించింది. ఈ విగ్రహాన్ని న్యూయార్క్ యూనియన్ స్కేర్‌లో 1986 అక్టోబరు 2న ఏర్పాటు చేశారు. దీనిని కొన్ని కారణాలతో 2001లో తొలగించి.. 2002లో మళ్లీ పునరుద్ధరించారు.