తెలంగాణ

telangana

ETV Bharat / international

పెరూలో భారీ భూకంపం.. తీవ్రత 8.0

పెరూ దేశంలోని పలు నగరాల్లో భారీ భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై 8.0గా తీవ్రత నమోదైందని అమెరికా జియోలాజికల్​ సర్వే తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెరూ ప్రభుత్వం హెచ్చరించింది.

పెరూలో భారీ భూకంపం.. తీవ్రత 8.0

By

Published : May 26, 2019, 3:06 PM IST

పెరూలో భారీ భూకంపం సంభవించింది.భూకంప లేఖినిపై తీవ్రత 8.0గా నమోదయినట్లు అమెరికా జియోలాజికల్​ సర్వే ప్రకటించింది.

ఆగ్నేయ ప్రాంతంలోని లాగునాస్​కు సుమారు 80 కిలోమీటర్ల దూరంలో... తెల్లవారు 2.41గంటల ప్రాంతంలో సుమారు 114 కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్లు తెలిపింది. ఈ ప్రాంతం తూర్పు ఈశాన్య దిశలోని అతిపెద్ద నగరం యురిమగువాస్​కు 158 కిలోమీటర్ల దూరంలో ఉంది.

రిక్టర్​ స్కేలుపై 7.2 తీవ్రత నమోదైనట్లు పెరూ ప్రభుత్వం ట్వీట్​ చేసింది. కలావో, రాజధాని లిమా పట్టణాల్లో భూమి కంపించినట్లు పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఇదీ చూడండి:వెనెజువెలా జైలులో ఘర్షణ-23మంది ఖైదీల మృతి

ABOUT THE AUTHOR

...view details