peru earthquake: పెరూలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.5గా నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 5.52 గంటలకు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. భూకంపం తీవ్రత ఎక్కువగానే ఉన్న.. లోతు కూడా అధికంగా ఉండటం వల్ల పెద్దగా ప్రాణ, ఆస్తి నష్టం కలగలేదు.
భూకంపం ధాటికి 16వ శతాబ్దానికి చెందిన ఓ పాత కాథోలిక్ ఆలయ టవర్ కూలిపోయింది. ఇతర ప్రాంతాల్లో కొన్ని చర్చ్‌లు ధ్వంసమయ్యాయి. క్షతగాత్రులు, ప్రాణ నష్టంపై సమాచారం తెలియాల్సి ఉంది.