హ్యూస్టన్లో జరిగిన హౌడీ మోదీ కార్యక్రమంలో భాగంగా భారత ప్రధాని మోదీ- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లతో ఓ బాలుడు సెల్ఫీ తీసుకున్నాడు. ఇప్పుడది నెట్టింట వైరల్ అవుతోంది.
అగ్రనేతలతో స్వీయ చిత్రం తీసుకున్న ఆ బుడతడు ఎవరా? అని ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చ మొదలైంది. ఇంతకీ ఆ పిల్లాడు ఎవరో తెలుసా?.. కర్ణాటకకు చెందిన సాత్విక్ హెగ్డే. కుటుంబంతో కలిసి ఎప్పటినుంచో అమెరికాలో ఉంటున్న 13 ఏళ్ల ఈ బాలుడు... అగ్రనేతలిద్దరితో సెల్ఫీ అవకాశం కొట్టేశాడు.