తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్​లో అమెరికా రాయబారిగా ఎరిక్! - లాస్ ఏంజెల్స్ మేయర్

భారత్​లో అమెరికా కొత్త రాయబారిగా తన విశ్వాసపాత్రుడు, లాస్​ ఏంజెల్స్ మేయర్ ఎరిక్​ గార్సెట్టిని నామినేట్ చేశారు అధ్యక్షుడు బైడెన్. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

Eric Garcetti
ఎరిక్ గార్సెట్టి, రాయబారి

By

Published : Jul 10, 2021, 2:12 AM IST

Updated : Jul 10, 2021, 4:09 AM IST

భారత్‌లో అమెరికా కొత్త రాయబారిగా లాస్ ఏంజెల్స్ మేయ‌ర్ ఎరిక్ గార్సెట్టిని నామినేట్ చేశారు అధ్యక్షుడు జో బైడెన్‌. సెనేట్ ధ్రువీకరిస్తే ఎరిక్‌ గార్సెట్టి.. రాయబారిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ట్రంప్ హయాంలో రాయబారిగా పనిచేసిన జస్టర్ స్థానంలో.. 50 ఏళ్ల గార్సెట్టి నియమితులవుతారు.

జస్టర్ కౌన్సిల్ ఆన్ ఫారెన్ రిలేషన్స్​లో ఎరిక్‌ విశిష్ట సహచరుడని శ్వేతసౌధం పేర్కొంది. 2013 నుంచి ఆయన లాస్ ఏంజెల్స్ మేయర్‌గా ఉన్నారని ఓ ప్రకటనలో వెల్లడించింది. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా బైడెన్‌ తనకు అత్యంత విశ్వాసపాత్రుడైన ఎరిక్‌ను రాయబారిగా నామినేట్‌ చేశారని శ్వేతసౌథం తెలిపింది. అయితే.. ఈ నామినేషన్​పై హర్షం వ్యక్తం చేశారు ఎరిక్​ గార్సెట్టి. సక్రమంగా విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

భారత్‌తో పాటు బంగ్లాదేశ్‌, చిలీ, మొనాకో సహా పలు దేశాలకు కూడా రాయబారులను నామినేట్‌ చేశారు అగ్రరాజ్య అధినేత బైడెన్.

ఇదీ చదవండి:'ఆగస్టు కల్లా బలగాల ఉపసంహరణ పూర్తి'

Last Updated : Jul 10, 2021, 4:09 AM IST

ABOUT THE AUTHOR

...view details