తెలంగాణ

telangana

ETV Bharat / international

Lunar Eclipse : ఈ శతాబ్దపు అద్భుతం.. 19వ తేదీన.. - అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ

శతాబ్దంలోనే సుదీర్ఘమైన పాక్షిక చంద్రగహణం నవంబరు 19న ( కార్తిక పౌర్ణమి నాడు) వినువీధిలో దర్శనమివ్వబోతుంది. ఇదే విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్ధ (నాసా) శనివారం ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం నవంబరు 19న శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు చంద్రుడు, సూర్యుడికి మధ్య భూమి ఒకే వరుసలో వచ్చి .. భూమి నీడ అసంపూర్తిగా చంద్రుడిపై పడి పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది.

Lunar Eclipse
పాక్షిక చంద్రగహణం

By

Published : Nov 7, 2021, 6:23 AM IST

ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. శతాబ్దంలోనే సుదీర్ఘమైన పాక్షిక చంద్రగహణం నవంబరు 19న ( కార్తిక పౌర్ణమి నాడు) వినువీధిలో దర్శనమివ్వబోతుంది. ఇదే విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్ధ (నాసా) శనివారం ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా నవంబరు 18, 19 తేదీల్లో వివిధ సమయాల్లో ఈ గ్రహణం కనిపించనుండగా.. భారతకాలమానం ప్రకారం నవంబరు 19న శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు.. చంద్రుడు, సూర్యుడికి మధ్య భూమి ఒకే వరుసలో వచ్చి .. భూమి నీడ అసంపూర్తిగా చంద్రుడిపై పడి పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. 3 గంటల 28 నిమిషాల పాటు ఏర్పడే ఈ పాక్షిక చంద్ర గ్రహణం.. చంద్రుని ఉపరితలం మొత్తం 97 శాతం ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే చంద్రుడు ఎవరికీ కనిపించకుండా ఈ పాక్షిక గ్రహణం దాచేస్తుంది. ఈ ఏడాదిలో ఇదే చివరి చంద్రగ్రహణం. ఈ ఏడాది తొలి చంద్ర గహణం.. మే 26 రోజున (వైశాఖ పౌర్ణమి) నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. నిండు చంద్రుడు ఆరోజు అరుణవర్ణంలో కనువిందు చేశాడు. దీన్నే బ్లడ్‌ మూన్, సూపర్‌ మూన్‌ అని అంటారు.

భారత్‌తో పాటు ఏ దేశాల్లో కనిపిస్తుందంటే..

  • భారత్‌లోని అసోం, అరుణాచల్‌ ప్రదేశ్‌తో పాటు ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో ఈ గ్రహణాన్ని వీక్షించొచ్చు. అలాగే ఉత్తర అమెరికాలోని 50దేశాలతో పాటు మెక్సికో వాళ్లూ దీన్ని పూర్తిగా చూడొచ్చు.
  • అమెరికా తూర్పు తీరంలో రాత్రిపూట చూసేవారు అద్భుతాన్ని తెల్లవారుజామున 2 నుండి 4 గంటల వరకూ చూడొచ్చు.
  • పశ్చిమ తీరంలో ఉన్నవారు రాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట మధ్య ఈ అద్భుతాన్ని వీక్షించే అవకాశముందని నాసా పేర్కొంది.
  • ఉత్తర, దక్షిణ అమెరికా, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా., పసిఫిక్ ప్రాంతంలోని ప్రజలకు ఈ పాక్షిక చంద్ర గ్రహణం దర్శనమివ్వబోతోంది.

ఈ గ్రహణాన్ని 'ఫ్రాస్ట్‌ మూన్‌'గా పిలుస్తారు.. ఎందుకంటే..

కార్తీక పౌర్ణమి నాడు ఏర్పడే ఈ పాక్షిక చంద్ర గ్రహణాన్ని.. మంచుతో కప్పబడిన చంద్రుడిగా ఫ్రాస్ట్ మూన్ అని పిలుస్తారు. శరదృతువు చివరిలో ఏర్పడే మంచు కారణంగా దానికి ఆ పేరు వచ్చింది. శరదృతువు చివరి పౌర్ణమి కూడా ఇదే. అమెరికాలోని కొన్ని స్థానిక తెగలు ఈ పేరు పెట్టారు. భూమి యొక్క నీడతో చంద్రుడు పూర్తిగా నల్లబడటం వల్ల సంపూర్ణ చంద్రగ్రహణంలా ఇది అద్భుతమైనది కానప్పటికీ, ఈ పాక్షిక గ్రహణం చంద్రుని ఉపరితలంలో 97% కనిపించకుండా దాచేస్తుంది.

మరికొన్ని ఆసక్తికర విషయాలు

వచ్చే 80 సంవత్సరాలలో 2021, 2030 మధ్య 20 సంపూర్ణ, పాక్షిక, పెనుంబ్రల్ గ్రహణాలు ఏర్పడే అవకాశముందని నాసా వెల్లడించింది. 2001 నుంచి 2100 శతాబ్దం మధ్య అత్యంత ఈ పాక్షిక చంద్రగ్రహణమే సుదీర్ఘమైనది కాగా 21వ శతాబ్దంలో ఇప్పటి వరకూ 228 చంద్ర గ్రహణాలు ఏర్పడనున్నాయి.ఈ ఏడాదికి ఇదే ఆఖరి కాగా చివరి చంద్ర గ్రహణం కాగా.. వచ్చే ఏడాది 2022, మే 15-16 తేదీల్లో సంపూర్ణ చంద్ర గ్రహణం (బ్లడ్‌ మూన్) ఏర్పడనుంది.

ఇదీ చూడండి:భారత్- ఫ్రాన్స్ కీలక నిర్ణయాలు- రక్షణ రంగంలో ముందడుగు

ABOUT THE AUTHOR

...view details