- ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో ముందుకొచ్చి గెలిపించిన వారందరికీ కృతజ్ఞతలు: బైడెన్
- ఎన్నికల్లో ఓడిన ట్రంప్ నాకు శత్రువేమీ కాదు: బైడెన్
- అమెరికా అభివృద్ధి కోసం కలిసి పనిచేయడానికి సిద్ధం: బైడెన్
- కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటాం: బైడెన్
- అమెరికాలోని ప్రతి కుటుంబ ఆరోగ్య పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం: బైడెన్
- దేశంలోని ప్రజలందరి ప్రయోజనాల కోసం పనిచేస్తాం: బైడెన్
- దేశాభివృద్ధి కోసం అహర్నిశలు కృషిచేస్తా: బైడెన్
'కొవిడ్‌పైనే తొలి యుద్ధం- వైరస్‌ను కట్టడి చేస్తాం' - అమెరికా అధ్యక్షుడు
07:21 November 08
07:16 November 08
- అమెరికా ప్రతిష్ఠను ఇనుమడింపజేసేందుకు పనిచేస్తాం: బైడెన్
- అధ్యక్ష ఎన్నికల్లో తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు: బైడెన్
- ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన కమలా హారిస్ అద్భుత నాయకురాలు: బైడెన్
- దేశ ప్రజలు ఆశిస్తున్న పాలనను అందించేందుకు సహకరిస్తారు: బైడెన్
07:13 November 08
- డెమొక్రాట్ల విజయోత్సవ సభలో బైడెన్ ప్రసంగం
- అధ్యక్ష ఎన్నికల్లో నా గెలుపు అమెరికన్ల విజయం: బైడెన్
- అమెరికన్లు తమ భవిష్యత్తు కోసం ఓటు వేశారు: బైడెన్
07:11 November 08
- అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత డెమొక్రాట్ల తొలి సభ
- మొదటి సభలో ప్రసంగించిన ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్
- బైడెన్ సొంతరాష్ట్రం డెలావర్‌లోని వెల్మింగ్టన్‌లో డెమొక్రాట్ల సభ
- ఉపాధ్యక్ష ఎన్నికల్లో నా విజయం మహిళాలోకం విజయం: కమలా హారిస్
- అమెరికా మహిళలు తమ ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసమే ఈ తీర్పు ఇచ్చారు: కమలా హారిస్
- ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి మహిళను కావొచ్చు.. కానీ చివరి మహిళను కాను: కమలా హారిస్
- అధ్యక్ష పదవికి ఎన్నికైన బైడెన్ నిరంతరం అమెరికన్ల క్షేమం కోసమే ఆలోచిస్తారు: కమలా హారిస్
- బైడెన్ అమెరికాను సురక్షితంగా ఉంచగలరని నాకు విశ్వాసం ఉంది: కమలా హారిస్
07:07 November 08
ఉపాధ్యక్షురాలిగా గెలిచిన డెమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో ఎంతో శ్రమ ఉందని అయితే అందులో ఆనందం కూడా ఉందన్నారు. మంచి భవిష్యత్తును నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
00:48 November 08
బైడెన్, హారిస్ విజయంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తరఫున ఇరువురికి శుభాకాంక్షలు తెలిపారు. బైడెన్ నాయకత్వంలో భారత్-అమెరికా బంధం మరింత బలోపేతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
00:39 November 08
గర్వంగా ఉంది...
ఉపాధ్యక్షురాలిగా గెలిచిన కమలా హారిస్‌కు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ అమెరికన్లకు హారిస్ విజయం గర్వకారణమన్నారు.
00:35 November 08
మోదీ శుభాకాంక్షలు...
అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన జో బైడెన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారత్-అమెరికా బంధాన్ని మరోస్థాయికి తీసుకెళ్లేందుకు బైడెన్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.
22:44 November 07
పని మొదలుపెడదామా?
డెమొక్రాట్ల విజయం అనంతరం ట్విట్టర్లో స్పందించారు ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్. ఈ ఎన్నిక తన గురించి, బైడెన్ గురించి కాదని.. ఇది అమెరికా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని పేర్కొన్నారు. ముందుముందు చేయాల్సిన పని చాలా ఉంది.. రంగంలోకి వెంటనే దిగాలని తెలిపారు.
22:36 November 07
'నేను అమెరికన్లందరికి అధ్యక్షుడిని'
పెన్సిల్వేనియాలో విజయం సాధించిన కొద్ది సేపటికి.. అమెరికన్లందరికి ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తేలిపారు జో బైడెన్. అధ్యక్షుడిగా రానున్న రోజుల్లో తాను చేయాల్సిన పనులు కష్టంగా ఉంటాయని పేర్కొన్నారు బైడన్. అయితే తనకు ఓటు వేసినా, వేయకపోయినా.. తాను మాత్రం అమెరికన్లందరికీ అధ్యక్షుడిగా ఉంటానని, తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయనని తెలిపారు.
22:20 November 07
అధ్యక్ష పోరు: జో బైడెన్‌కే 'అగ్రరాజ్య' పగ్గాలు
ఉత్కంఠకు తెరపడింది. అగ్రరాజ్య అధ్యక్ష పీఠాన్ని డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ దక్కించుకున్నారు. స్వింగ్ స్టేట్స్లో కీలకమైన పెన్సిల్వేనియాలో నెగ్గిన బైడెన్.. మ్యాజికల్ ఫిగర్ 270ని దాటారు. ఈ మేరకు అమెరికా వార్తాసంస్థలు కథనాలు ప్రచురించాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.