ప్రపంచవ్యాప్తంగా 550 మిలియన్ల ప్రవాస భారతీయుల్లో 200ల మందికిపైగా ఉన్నత స్థాయిల్లో కీలక పదవుల్లో ఉన్న వారి జాబితా విడుదల కానుంది. వివిధ రంగాల్లో ఉన్న నాయకుల ఘనతలను చాటి చెప్పేందుకు ఈ జాబితా ఉపయోగపడనుంది. సోమవారం(ఫిబ్రవరి 15)న 'అమెరికా ప్రెసిడెంట్స్ డే' సందర్భంగా తొలిసారి 15 దేశాల్లో కీలక పదవుల్లో ఉన్న ప్రవాస భారతీయుల జాబితాను విడుదల చేయనుంది ఇండియాస్పొరా సంస్థ.
అగ్రరాజ్యం ఉపాధ్యక్ష పదవి చేపట్టిన భారత సంతతి మహిళ కమలా హారిస్ ఈ జాబితాలో చేరడం విశేషం. ఇందులో సివిల్ సర్వెంట్స్ సహా కీలక పదవుల్లో ఉన్న వారి వివరాలు కూడా ఉన్నాయి.