తెలంగాణ

telangana

ETV Bharat / international

లిక్విడ్ నైట్రోజన్ లీక్- ఆరుగురు మృతి

అమెరికాలోని ఓ పౌల్ట్రీ ప్లాంట్​లో ప్రమాదం జరిగింది. ద్రవరూపంలోని నైట్రోజన్ లీక్ కావడం వల్ల ఆరుగురు మరణించారు. ఈ ఘటనలో అస్వస్థకు గురైనవారిని ఆస్పత్రికి తరలించారు.

liquid-nitrogen-leak-at-georgia-poultry-plant-kills-6
లిక్విడ్ నైట్రోజన్ లీక్- ఆరుగురు మృతి

By

Published : Jan 29, 2021, 5:37 AM IST

అమెరికా జార్జియాలోని ఓ పౌల్ట్రీ ప్లాంట్​లో లిక్విడ్ నైట్రోజన్ లీక్ అయింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. పలువురు అస్వస్థతకు గురికాగా.. వారిని ఆస్పత్రికి తరలించారు.

ఈశాన్య జార్జియాలోని గైనెస్​విల్​లో ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 10 గంటల తర్వాత ప్రైమ్ పాక్ ఫుడ్స్ కర్మాగారంలో ఈ లీకేజీ ఏర్పడినట్లు చెప్పారు.

ఈ నేపథ్యంలో చెలరేగిన మంటలను ఆర్పేందుకు వచ్చిన నలుగురు సిబ్బంది సైతం గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details