మనకు ఆరోగ్యం బాగాలేకపోతే ఏం చేస్తాం? బయటకు వెళ్లం. స్నేహితులను కలవం. ప్రస్తుత కరోనా సమయంలో అయితే అనారోగ్యంగా ఉన్నవారికి ఆమడ దూరంలో ఉంటాం. మనకే ఇబ్బంది ఎదురైతే సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్తాం. సరిగ్గా గబ్బిలాలు కూడా మనుషుల్లాగే చేస్తాయని అమెరికా పరిశోధకులు తెలిపారు. దీనిపై అధ్యయనం చేసి ఈ విషయాలను ధ్రువీకరించారు.
సెంట్రల్ అమెరికాలోని ఓ శాస్త్రవేత్తల బృందం గబ్బిలాలు నివాసం ఉండే ప్రాంతానికి వెళ్లింది. వాటిలో కొన్నింటిని వల వేసి పట్టుకున్నారు బృందంలోని సభ్యులు. ఆ తర్వాత వాటిలో సగం గబ్బిలాలకు సాధారణ సెలైన్ ఇచ్చారు. మిగతా వాటికి అనారోగ్యమయ్యేలా కెమికల్ లిపోపాలీసచరైడ్(ఎల్పీఎస్) ఇచ్చారు. ఆ తర్వాత వాటికి సెన్సార్లు అమర్చి వాటి నివాసంలోనే వదిలేశారు.