తెలంగాణ

telangana

ETV Bharat / international

బైడెన్‌, ట్రంప్‌ తర్వాత ఎవరంటే..!

అగ్రరాజ్య ఎన్నికల్లో అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించేవారిపై ఇంకా అనిశ్చితి వీడలేదు. అయితే.. బైడెన్, ట్రంప్​ల తర్వాత తృతీయ స్థానంపై స్పష్టత వచ్చింది. లిబర్టేరియన్​ పార్టీ తరఫున పోటీచేసిన 63 ఏళ్ల ఓ మహిళ ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. తాజా ఎన్నికల్లో ఈ పార్టీ గెలవకపోయినా.. ప్రధాన అభ్యర్థుల ఓట్లను చీల్చడంలో కీలకపాత్ర పోషిస్తోంది.

LIBERTARIAN CANDIDATE JORGENSEN OWN THE THIRD PLACE IN US ELECTIONS
బైడెన్‌, ట్రంప్‌ తర్వాత ఎవరంటే..!

By

Published : Nov 7, 2020, 6:57 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తొలి రెండు స్థానాల్లో ఎవరన్నదానిపై స్పష్టత రాకపోయినా.. మూడోస్థానంలో మాత్రం ఓ మహిళ ఉన్నారు. లిబర్టేరియన్‌ పార్టీ తరఫున పోటీ చేసిన 63 ఏళ్ల జో జొర్గెన్‌సన్‌ 16లక్షల ఓట్లు సంపాదించారు.

దక్షిణ కరోలినాలోని క్లెమ్‌సన్‌ విశ్వవిద్యాలయంలో మానసికశాస్త్ర సీనియర్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు జొర్గెన్​సన్​. ఆ పార్టీ తరఫున రంగంలో నిలిచిన తొలి మహిళ ఆమే కావడం విశేషం. ఈ పార్టీ ఎన్నికల్లో గెలవకపోయినా, ప్రధాన అభ్యర్థుల ఓట్లను చీల్చుతుంటుంది. ప్రస్తుతం విస్కాన్సిన్‌, మిషిగన్‌, నెవాడాల్లో బైడెన్‌, ట్రంప్‌ల మధ్య ఓట్ల తేడా చాలా తక్కువగా ఉండడానికి ఇదే కారణం.

రిపబ్లికన్లకు మద్దతు

జార్జియాలో జొర్గెన్​సన్​కు 61,269 ఓట్లు వచ్చాయి. అందుకే రిపబ్లికన్లకు మద్దతు తెలిపే ఈ రాష్ట్రంలో బైడెన్‌ మెజార్టీలోకి వచ్చారు. ఇంతవరకు అధిక ఓట్లు పొందిన ఆ పార్టీ అభ్యర్థుల్లో ఆమె రెండో వారు. 2016లో పోటీ చేసిన గ్యారీ జాన్సన్‌ 3.3 శాతం ఓట్లు సంపాదించారు. విదేశాలతో యుద్ధాలు వద్దని, అక్కడ పోరాటాలు చేస్తున్న అమెరికా సైనికులను తిరిగి రప్పించాలంటూ చేసిన ప్రచారానికి పలువురు ఆకర్షితులయ్యారు. డెమొక్రాటిక్‌, రిపబ్లికన్‌ పార్టీలు రెండూ ఒక్కటేనని, దేశ రుణభారాన్ని పెంచడం తప్ప.. ఏమీ చేయడంలేదని విమర్శలు చేశారు.

ఇదీ చదవండి:అధ్యక్ష పీఠానికి అత్యంత చేరువలో జో బైడెన్!

ABOUT THE AUTHOR

...view details