వెలుగుల పండగ దీపావళిని అమెరికాలోనూ సెలవు దినంగా (diwali in us holiday) ప్రకటించాలని ప్రతిపాదిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యురాలు కరోలిన్ బి మలోనే ప్రతినిధుల సభ(హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్చ)లో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. 'దీపావళి డే యాక్ట్' బిల్లును సభలో ప్రవేశపెట్టడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. చీకటిపై వెలుతురు, చెడుపై మంచి సాధించిన విజయానికి (diwali holiday in usa latest news) గుర్తుగా ఈ పండగను జరుపుకోవడం విశేషమని తెలిపారు.
అమెరికాలో దీపావళికి అధికారిక సెలవు!
అమెరికాలోనూ దీపావళి (diwali in usa 2021) అధికారిక పండగగా వెలుగొందనుందా? అంటే అవుననే అనిపిస్తోంది. దీపావళిని సెలవు దినంగా (diwali in us holiday) ప్రకటించాలని ప్రతిపాదిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యురాలు కరోలిన్ బి మలోనే ప్రతినిధుల సభ(హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్)లో బిల్లును ప్రవేశపెట్టారు.
మహమ్మారి కొవిడ్19పై పోరాటం కొనసాగుతున్న నేపథ్యంలోనూ ఈ పండగకు ప్రాధాన్యముందని మలోనే పేర్కొన్నారు. దీపావళిని ఫెడరల్ ప్రభుత్వ సెలవు దినంగా అధికారికంగా ప్రకటించాలని కోరారు. భారతీయ అమెరికన్ రాజా కృష్ణమూర్తి సహా పలువురు యూఎస్ కాంగ్రెస్ సభ్యులు, విదేశీవ్యహారాల కమిటీ ఛైర్మన్ గ్రెగరీ మీక్స్ తదితరులు ఈ బిల్లుకు మద్దతు తెలిపారు. ప్రపంచానికి, ప్రజల జీవితాలకు వెలుగులు ప్రసాదించే దీపావళి పండగను ఫెడరల్ హాలిడేగా ప్రకటించడం ఎంతో సముచితంగా ఉంటుందని రాజా కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి:కొవాగ్జిన్‌కు 'ప్రపంచ' గుర్తింపు- ఇక టీకా ఉత్పత్తి జోరు