పాప్ సింగర్ లేడీ గాగా శునకాలను దొంగల నుంచి సురక్షితంగా స్వాధీనం చేసుకున్నట్లు లాస్ ఏంజెల్స్ పోలీసులు శుక్రవారం తెలిపారు. తమ పోలీస్ స్టేషన్కు సాయంత్రం ఆరు గంటల సమయంలో ఓ మహిళ.. శునకాలను తీసుకొచ్చి అప్పగించారని పోలీసు అధికారి జోనాథన్ ట్రిపెట్ తెలిపారు. ఆమె ఎవరు? శునకాలను ఎక్కడ గుర్తించారు? తదితర విషయాలను మాత్రం వెల్లడించలేదు.
లేడీ గాగా ప్రతినిధులు, పరిశోధకులు స్టేషన్కు వచ్చి శునకాలను పరిశీలించారని, అవి తమవేనని నిర్ధరించారని ట్రిపెట్ చెప్పారు.