వాస్తవాధీన రేఖ వెంబడి ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తమ రక్షణాత్మక అవసరాలకు ఇతర దేశాల సహకారం ఎంత అవసరమో భారత్ తెలుసుకుందని యుఎస్ ఇండో-పసిఫిక్ కమాండ్ కమాండర్.. ఫిల్ డేవిడ్సన్ అన్నారు. సెనేట్ విదేశీ సంబంధాల కమిటీ సభ్యులతో ఆయన మాట్లాడారు.
"భారత్ చాలాకాలంగా వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి విధానాన్ని కలిగి ఉంది. చైనాతో నెలకొన్న సంక్షోభం సమయంలో.. భారత్ కు కొన్ని వస్తువులు అందించాం. కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య సముద్ర సహకారాన్ని పెంచుకున్నాం. హిందూ మహాసముద్రంలో చైనా చర్యలను కట్టడి చేయడమే లక్ష్యంగా భారత్ క్వాడ్‌లో భాగస్వామిగా మారింది. ఈ చర్య ఇతర దేశాలకు సహాయపడనుంది."