తెలంగాణ

telangana

ETV Bharat / international

'అమెరికాలో కరోనా తగ్గుతోంది.. ఆ మందు ఆపేసా'

అమెరికాలో కరోనా మృతుల సంఖ్య లక్షకు చేరువలో ఉంది. అయితే ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మాత్రం దేశంలో కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుతోందన్నారు. హైడ్రాక్సీక్లోరోక్విన్ కరోనా వైరస్​ను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని ట్రంప్ పునరుద్ఘాటించారు. తాను రెండు వారాల కోర్సు వాడానని.. దాని పనితీరు భేషుగ్గా ఉందన్నారు. ఇక వాడటం ఆపేసినట్లు చెప్పారు.

Keep using hydroxychloroquine: Trump
హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడుతూనే ఉంటా: ట్రంప్​

By

Published : May 25, 2020, 10:23 AM IST

అమెరికాలో కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుతోందని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య, మరణాల సంఖ్య భారీగా పడిపోయిందన్నారు. దేశంలో కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య లక్షకు చేరువవుతున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

కరోనా కట్టడి చర్యల్ని పర్యవేక్షిస్తున్న 'వైట్‌ హౌజ్‌' అధికారి డెబోరా బిర్‌క్స్‌ ఇటీవల మాట్లాడుతూ.. కరోనాతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య 50శాతానికి తగ్గిందన్నారు.

హెచ్‌సీక్యూ తీసుకోవడం ఆపేశా..

కరోనా వైరస్‌ ముప్పు నుంచి తప్పించుకోవడానికి తాను తీసుకున్న హైడ్రాక్సీక్లోరోక్విన్ ‌(హెచ్‌సీక్యూ)ను వాడడం ఆపేసినట్లు ట్రంప్‌ తెలిపారు. ఈ యాంటీ మలేరియా మందును రెండు వారాల పాటు తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని.. హెచ్‌సీక్యూ వాడిన లక్ష్యం నెరవేరిందని చెప్పుకొచ్చారు. ఈ ఔషధం వల్ల దుష్ప్రభావాలు ఉంటాయని అనేక మంది హెచ్చరించినప్పటికీ.. ట్రంప్‌ మాత్రం వెనకడుగు వేయలేదు. ఇప్పటికీ కరోనా చికిత్సలో హెచ్‌సీక్యూ వాడకాన్ని సమర్థిస్తున్నారు.

ఇదీ చూడండి:కొవిడ్‌ కోరల్లో: 24 గంటల్లో 85 వేలకు పైగా కొత్త కేసులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details