తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్​ వ్యాఖ్యలపై దుమారం- దిద్దుబాటు చర్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ కశ్మీర్ సమస్యపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తాజాగా అమెరికా చట్టసభ్యులు ట్రంప్​ వ్యాఖ్యలను ఖండించారు. కశ్మీర్​ అంశంలో భారత్​ వైఖరిని సమర్ధించారు. ట్రంప్​ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో నష్టనివారణ చర్యలు చేపట్టింది అగ్రరాజ్య ప్రభుత్వం. 'కశ్మీర్​' భారత్​, పాక్​ల ద్వైపాక్షిక సమస్యని, ఇరుదేశాలు శాంతి చర్చలు చేపడితే స్వాగతిస్తామని ప్రకటించింది.

ట్రంప్​ వ్యాఖ్యలపై దుమారం- అమెరికా దిద్దుబాటు చర్యలు

By

Published : Jul 23, 2019, 11:56 AM IST

Updated : Jul 23, 2019, 4:56 PM IST

కశ్మీర్​ అంశంలో మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ చేసిన​ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కశ్మీర్​ అంశం భారత్​, పాకిస్థాన్​ల​ ద్వైపాక్షిక సమస్య అని... దాయాదులు శాంతి చర్చలు చేపడితే స్వాగతిస్తామని అమెరికా విదేశాంగశాఖ ప్రకటించింది.

ఉగ్రవాద నిర్మూలనకు నిరంతర, పటిష్టమైన చర్యలు చేపట్టాలని పాకిస్థాన్​కు అమెరికా సూచించింది. అప్పుడే భారత్​తో విజయవంతంగా శాంతి చర్చలు జరగడానికి వీలవుతుందని స్పష్టం చేసింది.

"కశ్మీర్​ అంశం భారత్​, పాకిస్థాన్​ల ద్వైపాక్షిక సమస్య. ఇరుదేశాలు శాంతి చర్చలు చేపడితే దాన్ని ట్రంప్​ ప్రభుత్వం స్వాగతిస్తుంది. ఈ సమస్య పరిష్కారం కోసం సహాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉంది."-అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి

పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​తో భేటీ సందర్భంగా కశ్మీర్​ అంశాన్ని ట్రంప్​ ప్రస్తావించారు. భారత్​, పాకిస్థాన్​ మధ్య ఉన్న కశ్మీర్​ సమస్యపై మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. జూన్​లో జపాన్​ ఒసాకాలో జీ-20 సదస్సు వేదికగా కశ్మీర్​ సమస్యపై ప్రధాని మోదీతో చర్చించినట్లు తెలిపారు ట్రంప్. కశ్మీర్​ అంశంపై మధ్యవర్తిత్వం అవసరమని భారత ప్రధాని కోరినట్లు అగ్రరాజ్య అధ్యక్షుడు​ పేర్కొన్నారు.

భారత్​కు క్షమాపణలు..

కశ్మీర్​ అంశంపై డొనాల్డ్​ ట్రంప్​ చేసిన వ్యాఖ్యలను అమెరికా చట్టసభ్యులు తప్పుబట్టారు. ట్విట్టర్​ వేదికగా క్షమాపణలు చెప్పారు డెమొక్రటిక్ పార్టీ నేత బ్రాడ్​ షెర్మన్​.

ట్రంప్​ వ్యాఖ్యలపై దుమారం- అమెరికా దిద్దుబాటు చర్యలు

పలువురు కాంగ్రెస్ చట్టసభ్యులు కశ్మీర్ అంశంలో భారత్​ వైఖరికి మద్దతుగా నిలిచారు. కశ్మీర్​ అంశాన్ని పూర్తిగా భారత్​, పాక్​ దేశాలు... ద్వైపాక్షిక శాంతి చర్చల ద్వారా తేల్చుకోవాల్సిందేనని తేల్చిచెప్పారు.

భారత్​ తిరస్కరణ

ట్రంప్ ప్రతిపాదనను భారత్​ ఇప్పటికే తిరస్కరించింది. అలాగే జీ-20 సదస్సు సందర్భంగా... కశ్మీర్​ విషయంలో సహాయం చేయమని మోదీ కోరినట్లు ట్రంప్​ చేసిన వ్యాఖ్యలనూ ఖండించింది.

ఇదీ చూడండి: కుమారస్వామి 'రాజీనామ లేఖ' వెనకున్న కథేంటీ?

Last Updated : Jul 23, 2019, 4:56 PM IST

ABOUT THE AUTHOR

...view details