అగ్రరాజ్య 49వ ఉపాధ్యక్షురాలిగా ప్రమాణస్వీకారం చేశారు భారత సంతతి కమలా హారిస్. అమెరికా ఉపాధ్యక్ష పదవి చేపట్టిన తొలి నల్లజాతీయురాలిగా చరిత్రలో నిలిచారు 56ఏళ్ల కమల. ఉపాధ్యక్ష పదవిని ఓ మహిళ చేపట్టడం కూడా ఇదే తొలిసారి.
అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు చేపట్టే కొద్ది నిమిషాల ముందు ఉపాధ్యక్షురాలిగా ప్రమాణస్వీకారం చేశారు కమల. సుప్రీంకోర్టు న్యాయమూర్తి సోనియా సోటోమేయర్.. కమల చేత ప్రమాణం చేయించారు.