అమెరికా ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న కమలా హ్యారిస్ 56 వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్... కమల తర్వాత పుట్టిన రోజు వేడుకలను శ్వేతసౌధంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు గతంలో తీసుకున్న ఫొటోను తన ట్వీట్‌కు జత చేశారు బైడెన్. మాజీ విదేశాంగ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ కూడా హారిస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
'కమల తర్వాత పుట్టిన రోజు శ్వేతసౌధంలో జరగాలి ' - Kamala birthday news updates
అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న కమలా హ్యారిస్ 56 వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా హ్యారీస్‌కు.. అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ సహా పలువురు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
కమల తర్వాత పుట్టిన రోజు శ్వేతసౌధంలో..!
'అక్టోబర్ 20 ఎంతో ప్రత్యేకమైన రోజు. జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో అందరూ ఓటు వేయాలని కోరుతున్నాను' అంటూ ట్వీట్ చేశారు హారిస్.
ఇదీ చూడండి:ప్రథమ చికిత్సే పరమ ఔషధం