అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ కీలక ప్రకటన చేశారు. తమ పాలనలో వ్యక్తిగత వార్షిక ఆదాయం 4 లక్షల డాలర్ల (రూ.3 కోట్లు) లోపు ఉన్నవారికి పన్నులు పెంచబోమని తెలిపారు. అదే సమయంలో కార్పొరేట్లు, సంపన్నులు న్యాయంగా పన్నులు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు.
అంతకుముందు, వాషింగ్టన్లోని ఓ బేకరీని సందర్శించారు కమల, ఆమె భర్త డగ్లస్ ఎమాఫ్. ఇటువంటి దుకాణాలే దేశ పౌరులు, సైనికులకు సాధికారతను ఇస్తాయని అన్నారు.