అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతి మహిళ కమలా హారిస్.. వాషింగ్టన్‌లోని లింకన్ మెమోరియల్ భవనం మెట్లపై ఫిట్నెస్ కోసం పలు మార్లు కిందకు, పైకి పరుగులు తీశారు. ఈ పరుగుకు సంబంధించిన దృశ్యాలను ఓ అభిమాని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారాయి.
వైరల్: లింకన్ మెమోరియల్ మెట్లపై 'కమల' పరుగు
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఫిట్నెస్ కోసం లింకన్ మెమోరియల్ భవనం మెట్లపై ఆమె చేసిన పరుగును ఉద్దేశించి ఆభిమానులు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్
వీడియోను చూసిన నెటిజన్లు పలు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటివి చేయటం వల్లే ఉపాధ్యక్షురాలు ఫిట్‌గా ఉన్నట్లు కొందరు చెప్పుకొచ్చారు. భద్రతా సిబ్బందికి పని కల్పిస్తున్నారని మరికొందరు ఫన్నీ కామెంట్లు చేశారు.
ఇదీ చూడండి:భారత్-చైనా 'సయోధ్య'పై అమెరికా హర్షం