డెమొక్రాట్ల ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌పై విమర్శలు గుప్పించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు ఆమె అర్హురాలు కాదన్నారు. రిపబ్లికన్ల నామినేషన్‌ను అధికారికంగా అంగీకరించిన తర్వాత న్యూ హాంప్‌షైర్‌లో తొలి ర్యాలీ నిర్వహించారు ట్రంప్. అమెరికా అధ్యక్ష పదవిలో ఓ మహిళను చూడాలని తాను కూడా కోరుకుంటున్నా అని చెప్పారు. అయితే అందుకు సమర్థవంతమైన అభ్యర్థి తన కూతురు, శ్వేతసౌధ సీనియర్ సలహాదారు ఇవాంక ట్రంపే అన్నారు.
" అమెరికా అధ్యక్ష పదవిలో ఓ మహిళను చూడాలని నేనూ అనుంకుంటున్నాను. అయితే కమలా హారిస్ వంటి వ్యక్తి మాత్రం కానే కాదు. ఆమె సమర్థవంతురాలు కాదు. అధ్యక్ష అభ్యర్థి బరిలో ప్రచారం ఘనంగా ప్రారంభించి ఆ తర్వాత స్వయంగా తప్పుకునే స్థాయికి ఆమె పడిపోయారు. కొన్ని నెలలపాటు ఆమెకే విజయావకాశాలు ఉంటాయని అంతా భావించారు కానీ పరిస్థితి మొత్తం మారిపోయింది. చివరకు ఉపాధ్యక్ష అభ్యర్థిగా డెమొక్రాట్లు ఆమెను ఎంపిక చేశారు. "
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు