తెలంగాణ

telangana

ETV Bharat / international

ఫ్లాయిడ్ నిరసనలు ఉద్ధృతం- పాల్గొన్న ప్రధాని

జాతి విద్వేషానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పాల్గొన్నారు. నిరసనకారులకు మద్దతుగా మోకాళ్లపై నిల్చున్నారు. మరోవైపు అమెరికాలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. హ్యూస్టన్​, డెట్రాయిట్​లో ప్రజలు భారీ ర్యాలీలు నిర్వహించారు.

justin-trudeau
ఫ్లాయిడ్

By

Published : Jun 6, 2020, 5:30 AM IST

Updated : Jun 6, 2020, 6:21 AM IST

పోలీసు కర్కశత్వానికి బలైన జార్జి ఫ్లాయిడ్​కు సంఘీభావం ప్రకటించారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో. జాతి విద్వేషానికి వ్యతిరేకంగా ఒట్టావాలో ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరసనకారుల కోరిక మేరకు మోకాళ్లపై నిల్చొని వారికి మద్దతు ప్రకటించారు ట్రూడో.

నిరసనలో పాల్గొన్న జస్టిన్ ట్రూడో
మోకాళ్లపై నిల్చున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో

మరోవైపు జార్జి ఫ్లాయిడ్ మృతితో ప్రారంభమైన నిరసనలు అమెరికాలో కొనసాగుతున్నాయి. జాతి విద్వేషానికి వ్యతిరేకంగా వందలాది మంది నిరసనకారులు వీధుల్లోకి వచ్చి ఆందోళన నిర్వహించారు. తొలినాళ్లలో హింసాత్మకంగా సాగిన నిరసనలు క్రమంగా శాంతియుతంగా మారుతున్నాయి.

హ్యూస్టన్​కు చెందిన సంగీత కళాకారులు బన్​ బీ, ట్రయే థా.. ఫ్లాయిడ్ మృతికి సంఘీభావంగా ర్యాలీ నిర్వహించారు. వేల మంది ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. నల్లజాతీయుల హక్కులకు పూర్తి భద్రత కల్పించే విధంగా చట్టసవరణలు చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ప్రఖ్యాత డెట్రాయిట్​ వంతనపై ప్రజలు ర్యాలీ నిర్వహించారు.

జార్జి ఫ్లాయిడ్​కు నివాళిగా పుష్పాంజలి

ఫ్లాయిడ్ మృతికి కారణమైన పోలీసులపై తీవ్రమైన అభియోగాలు మోపడం వల్ల నిరసనలు కాస్త తగ్గుముఖం పట్టినట్లు అధికారులు చెబుతున్నారు.

Last Updated : Jun 6, 2020, 6:21 AM IST

ABOUT THE AUTHOR

...view details