అమెరికా-మెక్సికో మధ్య సరిహద్దు గోడను నిర్మించాలన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రయత్నానికి ఓక్లాండ్ కోర్టు అడ్డుకట్ట వేసింది. గోడ నిర్మాణం కోసం సైనిక నిధుల నుంచి 250 కోట్ల డాలర్లు ఉపయోగించుకోవలన్న ట్రంప్ ప్రతిపాదనను తోసిపుచ్చుతూ కోర్టు తీర్పునిచ్చింది.
కొంత మంది సామాజిక కార్యకర్తలు దాఖలు చేసిన పిటీషన్‌పై చేపట్టిన విచారణ ఆధారంగా తీర్పునిచ్చారు ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి హేవుడ్ ఎస్.గిలియం జూనియర్.