అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో మరో ఘట్టం ముగిసింది. డెమొక్రటిక్ నేత జో బైడెన్‌ను తదుపరి అధ్యక్షుడిగా, కమలా హారిస్‌ను ఉపాధ్యక్షురాలిగా అగ్రరాజ్య కాంగ్రెస్ ధ్రువీకరించింది. ఇక ఈ నెల 20న బైడెన్, హారిస్ పదవీ బాధ్యతలను చేపట్టనున్నారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఈ వేడుకను అట్టహాసంగా నిర్వహించకూడదని నిర్ణయించారు.
అయితే అధ్యక్షుడిగా బైడెన్ ధ్రువీకరణ ప్రక్రియ మాత్రం సజావుగా సాగలేదు. ఎలక్టార్ కాలేజీ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఊహించని రీతిలో అడ్డంకి ఏర్పడింది. అధ్యక్షుడు ట్రంప్ మద్దతుదారులు వేలాది మంది.. అగ్రరాజ్య క్యాపిటల్‌లోకి దూసుకొచ్చి బీభత్సం సృష్టించారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా కృషి చేశారు. ఈ ఘటనలో నలుగురు మరణించారు. దాదాపు నాలుగు గంటల పాటు నిలిచిపోయిన కాంగ్రెస్.. పరిస్థితి అదుపులోకి వచ్చాక.. బైడెన్‌ను అధ్యక్షుడిగా ధ్రువీకరించింది. బైడెన్‌కు 306 ఎలక్టార్ కాలేజీ ఓట్లు లభించినట్టు సమాచారం.
ట్రంప్ ఎట్టకేలకు..