మానవాళిని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. వీటిలో కొన్ని వ్యాక్సిన్‌లు ఇప్పటికే తొలి, రెండో దశలు పూర్తి చేసుకొని చివరి దశ ప్రయోగాల్లో నిమగ్నమయ్యాయి. ఈ వరుసలోనే జాన్సన్ & జాన్సన్ భారీస్థాయిలో మూడో దశ ప్రయోగాలకు సిద్ధమైంది. చివరి దశలో దాదాపు 60వేల మందిపై ప్రయోగాలు జరిపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సెప్టెంబర్ తొలివారంలో ప్రారంభమయ్యే ఈ ప్రయోగం అతిపెద్ద క్లినికల్ ట్రయల్‌గా నిలవనుంది.
ప్రపంచవ్యాప్తంగా 180 ప్రాంతాల్లో
కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ తయారీలో ఇప్పటికే మోడెర్నా, ఫైజర్, ఆస్ట్రాజెనికా వంటి సంస్థలు ముందున్నాయి. మోడెర్నా, ఫైజర్ తయారుచేసిన వ్యాక్సిన్ తుదిదశ పరిశోధనలకు 30వేల మంది చొప్పున వలంటీర్లను నియమించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అయితే, జాన్సన్ & జాన్సన్ సంస్థ జన్‌స్సేన్ పేరుతో తయారుచేసిన కొవిడ్ వ్యాక్సిన్(ఏడీ26.కోవ్2.ఎస్)ను మాత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60వేల మందిపై ప్రయోగించనున్నట్లు ఆ సంస్థ అధికార ప్రతినిధి వెల్లడించారు. అమెరికా, బ్రెజిల్, మెక్సికోతోపాటు మరిన్ని దేశాల్లోని దాదాపు 180 ప్రాంతాల్లో ఈ ప్రయోగాలు జరపనున్నట్లు పేర్కొన్నారు. ఈ మూడోదశ ప్రయోగాల కోసం ఇప్పటికే సరైన ప్రణాళికతోపాటు నియామక ప్రక్రియ చేపట్టినట్లు జాన్సన్ & జాన్సన్ తెలిపింది.
2021 ఆరంభం నాటికి