అమెరికాలో మూడో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఒకే డోసుతో కరోనాను నివారించేలా జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేసిన టీకా వినియోగానికి అమెరికా ఆహార, ఔషధ(ఎఫ్‌డీఏ) నియంత్రణ సంస్థ అనుమతి ఇచ్చింది.
85 శాతం సమర్థత!
వైరస్‌కు వ్యతిరేకంగా ఈ టీకా బలమైన రక్షణ అందిస్తోందని ఎఫ్‌డీఏ పేర్కొంది. తీవ్రంగా జబ్బుపడటాన్ని, మరణాలను నివారిస్తుందని తెలిపింది. తీవ్రమైన కొవిడ్‌కు వ్యతిరేకంగా 85 శాతం సమర్థతతో ఈ టీకా పనిచేస్తుందని వెల్లడించింది. మూడు ఖండాల్లో టీకాపై పరీక్షలు జరిగాయని, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లోనూ వ్యాక్సిన్ మంచి పనితీరు కనబర్చిందని ఎఫ్డీఏస్పష్టం చేసింది.