అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య సోమవారం కీలక భేటీ జరిగింది(biden xi meeting). వర్చువల్‌గా సమావేశమైన ఇరువురు నేతలు(biden xi meeting) పలు కీలక అంశాలపై చర్చించారు.
ఇరు దేశాల మన మధ్య నెలకొన్న పోటీనీ ఘర్షణపూరితంగా మారకుండా చూసే బాధ్యత తమపై ఉందని ఈ భేటీ ప్రారంభంలో జిన్‌పింగ్‌తో బైడెన్ అన్నారు.
తన పాత మిత్రుడ్ని కలవడం సంతోషంగా ఉందని జిన్‌పింగ్ బైడెన్‌తో అన్నారు. అమెరికా-చైనా సంబంధాలు మెరుగుపరుచుకునే దిశగా తాను బైడెన్‌తో కలిసి పని చేయడానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. "చైనా, అమెరికా పరస్పరం గౌరవించుకోవాలి. శాంతి నెలకొల్పేందుకు కృషి చేయాలి. ఇరు దేశాల విజయంలో సహకారం అందించుకోవాలి" అని బైడెన్‌తో జిన్‌పింగ్ చెప్పారు.