తెలంగాణ

telangana

ETV Bharat / international

కంటతడి పెట్టిన జో బైడెన్.. ఎందుకంటే? - బైడెన్ కంట నీరు

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్​ భావోద్వేగానికి లోనయ్యారు. ఆరోగ్య సిబ్బందితో ఆన్​లైన్​ వేదికగా సమావేశమైన ఆయన కరోనా కష్టకాలంలో వారు ఎదుర్కొన్న అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో బైడెన్​ కన్నీరు పెట్టారు.

Joe Biden wipes away tears during interacted with with frontline workers of covid
ఆన్​లైన్​ సమావేశంలో కంటతడి పెట్టిన బైడెన్‌

By

Published : Nov 19, 2020, 11:47 AM IST

అగ్రరాజ్య అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ కంటతడి పెట్టారు. ఆరోగ్య సిబ్బందితో జరిగిన ఓ అన్‌లైన్‌ సమావేశం సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. కరోనా విధుల్లో ఉన్న ఆ దేశ ఆరోగ్య సిబ్బంది తమ క్షేత్ర స్థాయి అనుభవాలను కాబోయే అధ్యక్షుడికి తెలియజేశారు. ఈ క్రమంలో మిన్నెసోటాకు చెందిన మేరీ టర్నర్‌ అనే నర్స్‌.. మరణానికి చేరువలో ఉన్న కొవిడ్‌ బాధితులతో తన అనుభవాలను వివరించారు. కొవిడ్‌ బాధితులు తమ కుటుంబ సభ్యులు, ఆత్మీయుల కోసం పరితపించే వారని, వారి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని ఓదార్చానని మేరీ చెప్పారు. అది విన్న బైడెన్‌ ఒకింత భావోద్వాగానికి గురై కన్నీరు కార్చారు.

ప్రపంచంలోనే సంపన్న దేశాల్లో ఒకటైన అమెరికా కరోనా కారణంగా అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. మాస్కులు అతి ముఖ్యమనే వైద్య నిపుణుల సూచలను కొట్టి పారేసిన డొనాల్డ్‌ ట్రంప్‌.. తమ దేశం 'కింగ్‌ ఆఫ్‌ వెంటిలేటర్స్‌' అని పదేపదే ప్రకటించారు. ఈ సమావేశం సందర్భంగా పలువురు నర్సులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను బైడెన్‌కు వివరించారు. పీపీఈ కిట్ల కొరత వేధిస్తోందని తెలిపారు. రక్షణ కోసం తాము ప్లాస్టిక్‌ సంచులను వాడుతున్నామని కొందరు బైడెన్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఎన్- 95 మాస్కులను మళ్లీ మళ్లీ వాడడంలో అవి వదులై కింద పడిపోయిన సందర్బాలూ ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తంచేశారు.

ఇదీ చూడండి: మరోసారి స్పీకర్​గా పెలోసీ- బైడెన్​ అభినందనలు

ABOUT THE AUTHOR

...view details