తెలంగాణ

telangana

ETV Bharat / international

పోటస్​గా మారిన బైడెన్ ట్విట్టర్​ ఖాతా - బైడెన్​ ట్విట్టర్

అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే​ జో బైడెన్​ ట్విట్టర్ ఖాతా @PresElectBiden నుంచి @POTUSగా మారిపోయింది. నూతన పాలక వర్గానికికి సంబంధించిన అన్ని అధికారిక ఖాతాలను ట్విట్టర్​ బదిలీ చేసింది.

Joe Biden takes over @POTUS Twitter account after inauguration
పోటస్​గా మారిన బైడెన్ ట్విట్టర్​ ఖాతా

By

Published : Jan 21, 2021, 10:24 AM IST

అమెరికా 46వ అధ్యక్షునిగా జో బైడెన్​ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ వెంటనే నూతన పాలక వర్గానికి సంబంధించిన అన్ని ట్విట్టర్​ ఖాతాలను ఆ సంస్థ​ అధికారికంగా బదిలీ చేసింది. నిన్నటి వరకు ప్రెసిడెంట్​ ఎలక్ట్​గా ఉన్న బైడెన్ ఖాతా(@PresElectBiden) ఇప్పుడు పోటస్​గా(@POTUS) మారిపోయింది. అలాగే వైస్​ ప్రెసిడెంట్​, వైట్​హౌస్​, ఫ్లోటస్​ల అధికారిక ఖాతాలు బదిలీ అయ్యాయి.

  • POTUS​ అంటే.. అమెరికా అధ్యక్షుడికి సంక్షిప్త రూపం. FLOTUS​ అంటే అమెరికా తొలిమహిళ అని అర్థం.
  • ట్విట్టర్​లోని ఈ ఖాతాలన్నీ ఏ ఒక్క వ్యక్తికీ శాశ్వతంగా ఉండవు. ప్రభుత్వం మారినప్పుడల్లా ఈ ఖాతాలూ మారుతూ ఉంటాయి.
  • అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్​కు చెందిన @POTUS ​ ఖాతా ఇకపై @POTUS45 గా మారనుంది. అంతకుముందు ఒబామా పదవీకాలం ముగిసిన అనంతరం.. ఆయన వినియోగించిన ఖాతాను POTUS44 గా మార్చేసింది ట్విట్టర్​.

ABOUT THE AUTHOR

...view details