తెలంగాణ

telangana

ETV Bharat / international

'నేను గెలిస్తే ఉచితంగా కరోనా వ్యాక్సిన్​' - అమెరికా వార్తలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడుతోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇరు పార్టీల అభ్యర్థులు హామీల వర్షం గుప్పిస్తున్నారు. తాజాగా.. తాను గెలిస్తే ఉచితంగా కరోనా వ్యాక్సిన్​ అందజేస్తామని హామీ ఇచ్చారు డెమొక్రటిక్​ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్.

joe biden says if they win election they will give free vaccine for americans
'నేను గెలిస్తే ఉచితంగా కరోనా వ్యాక్సిన్​'

By

Published : Oct 25, 2020, 6:45 AM IST

తాను అధ్యక్షునిగా ఎన్నికైతే అమెరికావాసులు అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్​ అందజేస్తానని డెమొక్రటిక్​ పార్టీ అభ్యర్థి జో బైడెన్​ హామీ ఇచ్చారు. శుక్రవారం సొంతరాష్ట్రం డెలవేర్​లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు.

"వ్యాక్సిన్​ అందుబాటులోకి వస్తే ఆరోగ్య బీమా ఉందా లేదా అన్న దానితో సంబంధం లేకుండా అందరికీ ఉచితంగా ఇస్తాం. అవసరమైన వ్యాక్సిన్​ మొత్తాన్ని​ ప్రభుత్వమే కొనుగోలు చేసి పంపిణీ చేస్తుంది."

-- జో బైడెన్, డెమొక్రటిక్​ అధ్యక్ష అభ్యర్థి

అధ్యక్షుడు ట్రంప్​ వద్ద ఎలాంటి ప్రణాళిక లేకపోవడం వల్లే దేశంలో కరోనా విజృంభించిందని ఆరోపించారు.

వీక్షకుల సంఖ్యలో తగ్గుదల

ట్రంప్​-బైడెన్​ చివరి సంవాదాన్ని 6.3 కోట్ల మంది టీవీల్లో వీక్షించారు. మొదటి సంవాదంతో పోల్చితే వీక్షకుల సంఖ్య ఒక కోటి తగ్గింది.

ఇదీ చూడండి:అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటువేసిన ట్రంప్​

ABOUT THE AUTHOR

...view details