నవంబరు 3న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ అభ్యర్థిగా జో బైడెన్‌ను అధికారికంగా నామినేట్ చేసింది డెమొక్రటిక్ పార్టీ. పార్టీ జాతీయ సదస్సులో ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. అనంతరం సదస్సులో తొలిసారి లైవ్ స్క్రీన్‌పై కనిపించారు బైడెన్, ఆయన సతీమణి జిల్. పార్టీ ప్రకటన అనంతరం బైడెన్ మనవరాళ్లు, మనవళ్లు సంబురాల్లో మునిగిపోయారు.
అంతకుముందు డెమెుక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా నామినేషన్‌ను అంగీకరించడం తన జీవితంలో అత్యున్నత గౌరవంగా భావిస్తున్నట్లు ట్వీట్ చేశారు బైడెన్.