అమెరికా సార్వత్రిక ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులుగా నామినేట్ కావడానికి అవసరమైన పత్రాలపై అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్, భారత సంతతికి చెందిన సెనేటర్ కమలా హారిస్ సంతకం చేశారు.
బైడెన్-హారిస్ ద్వయం నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్ష అభ్యర్థి మైక్ పెన్స్‌తో తలపడనున్నారు. డెమొక్రటిక్ అభ్యర్థులుగా సంతకం చేసిన అనంతరం ఎన్నికల ప్రచార ప్రణాళికను వివరించిన జో బైడెన్.. తాను డెలావేర్ రాష్ట్రంలో, హారిస్ కాలిఫోర్నియాలో ఓట్లు అభ్యర్థించనున్నట్లు చెప్పారు.