తెలంగాణ

telangana

ETV Bharat / international

బైడెన్ చారిత్రక నిర్ణయం.. సుప్రీం జడ్జిగా నల్లజాతీయురాలు - america supreme court news

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు జడ్జిగా ఆఫ్రికన్​ మహిళ అయిన కెటాన్జీ జో బ్రౌన్​ను నామినేట్​ చేస్తున్నుట్లు అమెరికా ప్రకటించింది. జస్టిస్ స్టీఫెన్ బ్రేయర్ స్థానంలో బ్రౌన్​ జాక్సన్​ను బైడెన్ భర్తీ చేయనున్నారు.

అమెరికా సుప్రీం కోర్టు
america supreme court

By

Published : Feb 26, 2022, 11:50 AM IST

అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కెటాన్జీ జో బ్రౌన్​ను బైడెన్ నామినేట్​ చేయబోతున్నట్లు శ్వేత సౌధం నుంచి ఓ ప్రకటన వెలువడింది. తొలి నల్ల జాతీయురాలు దేశ అత్యున్నత నాయపీఠాన్ని అధిష్టించనుండడం ఒక చారిత్రక పరిణామం.

గత రెండు శతాబ్దాలుగా శ్వేత జడ్జీలతో కొనసాగుతున్న న్యాయమూర్తుల కూర్పులో వైవిధ్య మార్పులను తీసుకొస్తామని గతేడాది బైడెన్​ తన ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఈ ఏడాది వేసవి ముగిసే సమయానికి పదవీ విరమణ చేయనున్న జస్టిస్ స్టీఫెన్ బ్రేయర్(83) స్థానంలో బ్రౌన్​ జాక్సన్​ను బైడెన్ భర్తీ చేయనున్నారు.

గుమస్తాగా పనిచేసి..

జాక్సన్ (51) తన న్యాయవాద వృత్తి ప్రారంభంలో స్టీఫెన్​ బ్రేయర్ దగ్గర గుమస్తాల్లో ఒకరిగా పనిచేశారు. ఆమె హార్వర్డ్‌లో అండర్ గ్రాడ్యుయేట్‌గా లాస్కూల్‌లో చదువుకున్నారు. 2013లో ఫెడరల్ జడ్జి అయ్యే ముందు ఫెడరల్ శిక్షా విధానాన్ని అభివృద్ధి చేసే ఏజెన్సీ అయిన యూఎస్​ సెంటెన్సింగ్ కమిషన్‌లో పనిచేశారు. ప్రస్తుతం జాక్సన్​ ఫెడెరల్​ కోర్టులో సేవలందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details