అమెరికా అధ్యక్ష పదవి అంటే అంత ఈజీ కాదు. అధికారంతోపాటు ఆపదలు ఎక్కువే ఉంటాయి. అందుకే సాధారణ భద్రతతోపాటు అధ్యక్షుడికి, ఆయన కుటుంబానికి.. ఆయనతో కలిసి పనిచేసే ముఖ్యమైన వ్యక్తులకు ప్రభుత్వం రహస్య భద్రత కల్పిస్తుంటుంది. ఈ క్రమంలో భద్రతా దళాలు వారిని అసలు పేర్లకు బదులు సీక్రెట్ సర్వీస్ కోడ్ పేర్లతో పిలుస్తుంటాయి. చాలాకాలంగా ఈ సీక్రెట్ సర్వీస్ కోడ్ అమల్లో ఉంది. తాజాగా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌కు కూడా సీక్రెట్ సర్వీస్ కోడ్ పేర్లను కేటాయించారు. జో బైడెన్‌ను 'సెల్టస్' అని, కమలా హ్యారీస్‌ను 'పయోనీర్' అని పిలవనున్నారు.
బైడెన్, కమలా.. సీక్రెట్ కోడ్ పేర్లు ఇవే..! - kamala haris latest news
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌కు భద్రతా దళాలు సీక్రెట్ సర్వీస్ కోడ్ పేర్లను కేటాయించాయి. జో బైడెన్‌ను 'సెల్టస్' అని, కమలా హ్యారీస్‌ను 'పయనీర్' అని పిలవనున్నారు.
బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రహస్య భద్రతదళాలు ఒబామాను 'రెనెగేడ్' అని, ఆయన సతీమణి మిచెల్ ఒబామాను 'రెనీసన్స్' అని పిలిచాయి. ఆ తర్వాత అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్‌ను 'ముఝల్' అని, ఆయన సతీమణి మెలినియా ట్రంప్‌ను 'మ్యూస్', కుమార్తె ఇవాంకను 'మార్వెల్', కుమారుడు ట్రంప్ జూనియర్‌ను 'మౌంటనీర్', ఎరిక్ ట్రంప్‌ను 'మార్స్‌మన్', అల్లుడు కుష్నర్‌ను 'మెకానిక్' అని పిలిచారు. ప్రస్తుతం అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన బైడెన్ మాత్రం బరాక్ ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు తనకు కేటాయించిన సెల్టస్ పేరును, తన సతీమణి జిల్ బైడెన్‌కు కేటాయించిన కాప్రి పేరును ఇప్పుడూ కొనసాగించడానికి ఇష్టపడుతున్నారు. ఇక కమలా హారిస్.. వైట్‌హౌస్ అధికారులు సూచించిన సీక్రెట్ సర్వీస్ కోడ్ పేర్లలో ఉన్న 'పయనీర్'ను గత కొన్ని నెలల కిందటే ఎంచుకున్నారట. ఇప్పుడు ఆ పేరును ఖరారు చేశారు. త్వరలో అధ్యక్ష, ఉపాధ్యక్షుల కుటుంబసభ్యులకు కూడా సీక్రెట్ సర్వీస్ కోడ్ పేర్లను కేటాయించనున్నారు.
- ఇదీ చూడండి:అమెరికా నూతన కథను లిఖిద్దాం రండి: బైడెన్