అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంపాదన కన్నా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఆదాయమే ఎక్కువ. 2020లో ఉపాధ్యక్షురాలి ఆదాయం రూ.12.41కోట్లుగా ఉంటే.. బైడెన్ సంపాదన కేవలం రూ.4.44 కోట్లే. ఈ మేరకు వారిద్దరూ తమ ఆదాయ పన్ను రిటర్నుల వివరాలను సోమవారం వెల్లడించారు.
అధ్యక్షుడు బైడెన్, అమెరికా తొలి మహిళ జిల్.. తమ ఆస్తుల వివరాలను సంయుక్తంగా ప్రకటించారు. 2019లో 9.85లక్షల డాలర్లు(రూ.7.21కోట్లు) ఉన్న వారి స్థూల ఆదాయం 2020లో 6.21లక్షల డాలర్లకు (సుమారు రూ.4.44కోట్లు) పడిపోయింది. అధ్యక్ష దంపతులు 2020 ఏడాదికి 1.57లక్షల డాలర్ల(రూ.1.15కోట్లు) పన్ను చెల్లించారు. అంటే అది వారి ఆదాయంలో 25.9శాతం.
ఇక ఉపాధ్యక్షరాలు కమలా, ఆమె భర్త డో ఎమ్ హాఫ్ ల స్థూల ఆదాయం.. 16.95లక్షల డాలర్లు(సుమారు రూ.12.41కోట్లు). వారు 6.21 లక్షల డాలర్ల(రూ.4.55కోట్లు) పన్ను చెల్లించారు. అంటే 36.7శాతం.