తెలంగాణ

telangana

ETV Bharat / international

జైశంకర్, పాంపియో మధ్య టెలిఫోన్ సంభాషణ - Indo-Pacific

అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియోతో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ఫోన్​లో సంభాషించారు. అంతర్జాతీయ సమస్యలతో పాటు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పరిస్థితులపై చర్చించారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న 2+2 చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఇరువురు నేతలు వెల్లడించారు.

Jaishankar, Pompeo talk over phone; discuss cooperation to contain COVID-19, Indo-Pacific
జైశంకర్, పాంపియో మధ్య టెలిఫోన్ సంభాషణ

By

Published : Aug 7, 2020, 5:34 AM IST

కరోనా నియంత్రణ చర్యలపై అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియోతో భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ ఫోన్​లో మాట్లాడారు. అంతర్జాతీయంగా నెలకొన్న సమస్యలు, ద్వైపాక్షిక సహకారంపై చర్చించారు. వీటితో పాటు ఇండో పసిఫిక్ ప్రాంతంలో పరిస్థితులపై ఇరువురు చర్చించినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు.

ప్రపంచవ్యాప్తంగా శాంతి, శ్రేయస్సు, భద్రత పెంపొందించడానికి భారత్​-అమెరికా మధ్య దృఢమైన సంబంధాల ఆవశ్యకతను నేతలిద్దరు నొక్కి చెప్పినట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రిన్సిపల్ డిప్యూటీ ప్రతినిధి కేల్ బ్రౌన్ పేర్కొన్నారు. చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకోవాలని చూస్తున్న ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సహకారాన్ని మరింత విస్తృతం చేసే మార్గాలను అన్వేషించినట్లు తెలిపారు.

"ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై పూర్తిస్థాయిలో సహకారం కొనసాగించాలని ఇరువురు నేతలు అంగీకారానికి వచ్చారు. భారత్- అమెరికా మధ్య ఈ ఏడాది చివర్లో జరిగే 2+2 చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు."

-కేల్ బ్రౌన్, అమెరికా విదేశాంగ శాఖ ప్రిన్సిపల్ డిప్యూటీ ప్రతినిధి

అంతర్జాతీయ సమస్యలతో పాటు అఫ్గాన్​లో శాంతి స్థాపన ప్రక్రియపైనా జైశంకర్, పాంపియో చర్చించినట్లు బ్రౌన్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details