అమెరికా పర్యటనలో భాగంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్థానిక కాలమానం ప్రకారం బుధవారం.. బైడెన్ యంత్రాంగంలోని పలువురు కీలక నేతలతో చర్చలు జరపాల్సి ఉంది. వాషింగ్టన్లో మూడు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో విదేశాంగ మంత్రి టోనీ బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్, జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివాన్లను కలవనున్నట్లు సమాచారం. బైడెన్ ప్రభుత్వం ఏర్పడిన తొలి 100 రోజుల్లో ఇరు దేశాల మధ్య దౌత్యసంబంధాలు ఏ స్థాయిలో మెరుగయ్యాయి అనే విషయంపై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
అంతకుముందు ఆ దేశ మాజీ జాతీయ భద్రతా సలహాదారు జనరల్ హెచ్ఆ మెక్‌మాస్టర్ ఆధ్వర్యంలో హూవర్ ఇన్స్టిట్యూషన్ నిర్వహించిన సమావేశంలో జైశంకర్ పాల్గొన్నారు. బ్యాటిల్‌గ్రౌండ్స్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో.. పాకిస్థాన్, అమెరికాలతో ఉన్న సంబంధాలు, భారత్‌లో ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై మాట్లాడారు.
'ఉగ్రవాదాన్ని సహించం'
భారత్ ఉగ్రవాదాన్ని సహించదు అని జైశంకర్ స్పష్టం చేశారు. తీవ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలతో దౌత్యసంబంధాలకు అంగీకరించమని వెల్లడించారు. ఈ మేరకు పాకిస్థాన్‌పై జైశంకర్ పరోక్ష విమర్శలు చేశారు. భారత్ పాకిస్థాన్ సైన్యాల మధ్య ఇటీవల జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి.. ఇరు దేశాల మధ్య మరిన్ని సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు.
వాస్తవం వేరు..