అమెరికన్ బహుళజాతి సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్, బెత్ ఇజ్రాయెల్ డీకనెస్ మెడికల్ సెంటర్ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్.. ఏడీ 26 సార్స్ కోవ్ 2, జంతువుల్లో సత్ఫలితాలను ఇచ్చిందని ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ ప్రయోగించిన ఎలుకలు బలమైన రోగనిరోధక ప్రతిస్పందనను కలిగి ఉన్నాయని.. వాటి రోగ నిరోధక శక్తి పెరిగిందని తెలిపింది. ఈ టీకా ఎలుకల్లో బరువు తగ్గడం, న్యుమోనియా, మరణ ప్రమాదం సహా తీవ్రమైన వ్యాధులను నివారించిందని ఈ ప్రయోగంలో నిరూపితమైందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వ్యాక్సిన్ కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా రోగ నిరోధక శక్తిని పెంచేందుకు శరీరాన్ని ప్రేరేపిస్తుందని అధ్యయనంలో వెల్లడైంది. వ్యాక్సిన్ చేసిన జంతువులు తక్కువ బరువు కోల్పోయాయని, ఊపిరితిత్తులు, ఇతర అవయవాల్లో వైరస్ చాలా తక్కువగా ఉందని అధ్యయనం వెల్లడించింది.
'జాన్సన్ అండ్ జాన్సన్' వ్యాక్సిన్ ఆశాజనక ఫలితాలు - journal Nature Medicine
ఏడీ 26 సార్స్ కోవ్ 2 అనే కరోనా వ్యాక్సిన్ జంతువుల్లో సత్ఫలితాలను ఇచ్చినట్లు అమెరికా శాస్ర్రవేత్తలు తెలిపారు. దీనిని ఎలుకలపై ప్రయోగించగా వాటి రోగ నిరోధక శక్తి మెరుగుపడిందని, న్యూమోనియా, మరణ ప్రమాదాన్ని నివారించిందని వెల్లడించారు.
ఎలుకలపై సత్ఫలితాలను ఇచ్చిన అమెరికా కరోనా వ్యాక్సిన్
ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌ను మానవులపై ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నామని సెంటర్ ఫర్ వైరాలజీ అండ్ వ్యాక్సిన్ రీసెర్చ్ డైరెక్టర్ డాన్ బరూచ్ చెప్పారు. మానవుల్లో ఇది తీవ్రమైన న్యుమోనియా, మరణ ప్రమాదాన్ని నివారించగలదా అనేది క్లినికల్ ట్రయల్స్‌లో తేలాల్సి ఉందని బరూచ్ అన్నారు.