దేశంలో కరోనా ఉద్ధృతిపై ఐరాస సాధారణ అసెంబ్లీ అధ్యక్షుడు వోల్కన్ బోజ్కిర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు కలిసికట్టుగా భారత్కు అండగా ఉండాలని ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు.
" భారత్లో కొవిడ్-19 పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. అన్ని దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు భారత్ ఎంతగానో కృషి చేసింది. ప్రపంచ దేశాలు కలిసికట్టుగా భారత్కు అండగా ఉండాల్సిన సమయం వచ్చింది."