2022లోనూ అమెరికన్లు మాస్కులు ధరించాల్సి రావొచ్చని అమెరికా అధ్యక్ష ప్రధాన వైద్య సలహాదారు, ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు ఆంటోనీ ఫౌచీ అభిప్రాయపడ్డారు. ఏడాది కాలంగా కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నారని, ఈ ఏడాది చివరి కల్లా సాధారణ పరిస్థితులు ఏర్పడే అవకాశముందని చెప్పారు.
'2022లోనూ అమెరికన్లకు మాస్కులు తప్పవు' - అమెరికా
వచ్చే ఏడాది కూడా అమెరికన్లు మాస్కులు ధరించక తప్పకపోవచ్చని ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు ఆంటోనీ ఫౌచీ అన్నారు. 2021 చివరికల్లా మహమ్మారి ముందు నాటి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
'2022లో కూడా అమెరికన్లకు మాస్కులు తప్పవు!'
"కరోనా నుంచి కాపాడుకోవడానికి 2022లో కూడా అమెరికన్లు మాస్కు ధరించాల్సిన అవసరం ఏర్పడవచ్చు. ఈ ఏడాది చివరికల్లా సాధారణ పరిస్థితులు నెలకొన్నా.. ఆ పరిస్థితి తప్పకపోవచ్చు." అని ఫౌచీ అన్నారు.
ఇదీ చూడండి:'కరోనా తొలగిపోతుందని భావిస్తే పొరబడినట్లే'