అమెరికా- 2020 అధ్యక్ష ఎన్నికల్లో జరిగిన ఓటింగ్ మోసాలు, అన్యాయాలపై సుప్రీంలో బలమైన వాదనలు వినిపించడం తనకు క్లిష్టమైన పనేనని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. న్యాయస్థానాలు కనీసం తన వాదనను వినిపించుకోవడం లేదని ఆరోపిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓటమిని అంగీకరించబోనని వెల్లడించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారి ఓ టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు ట్రంప్. ఈ నేపథ్యంలో... తన వానదనలకు ఆధారాలు సమర్పించాలని తాము విశ్వప్రయత్నాలు చేస్తున్నా కోర్టు జడ్జిలు మాత్రం కనీసం తమ వ్యాజ్యాలను స్వీకరించడం లేదని వాపోయారు. అయినప్పటికీ తమ న్యాయపోరాటం అగదని, ఇప్పటికే వందల కొద్ది వ్యాజ్యాలు కోర్టుల్లో వేశామని ట్రంప్ వెల్లడించారు.