కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో.. అమెరికా పంపిన వైద్య పరికరాలను నాలుగు విమనాల్లో భారత్కు చేరుకున్నాయి. ఈ వైద్యపరికరాలు భారత్కు చేరవేయడంలో కృషి చేసినవారందరినీ ట్విటర్ వేదికగా ప్రశంసించారు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్.
"ఇప్పటివరకు మొత్తంగా నాలుగు విమనాల్లో వైద్యపరికరాలు భారత్కు పంపాం. 1 మిలియన్ రాపిడ్ టెస్టు పరికరాలు, 545 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు, 16,00,300 ఎన్95 మాస్కులు, 457 ఆక్సిజన్ సిలిండర్లు, 440 రెగ్యులేటర్లు, 220 పల్స్ ఆక్సిమీటర్లు ఇతర వైద్య పరికరాలు పంపించాం."
-- లాయిడ్ ఆస్టిన్, అమెరికా రక్షణ మంత్రి.