అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి ఎన్నిక కావడం కష్టమేనని సర్వే సంస్థలు చెబుతున్నాయి. ప్రధాన ప్రత్యర్థి జో బైడెన్‌తో పోలిస్తే ట్రంప్‌కు తక్కువ మంది మద్దతిస్తున్నారని వాషింగ్టన్ పోస్ట్, ఏబీసీ న్యూస్ నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంది.
కరోనా కట్టడిలో విఫలం
కరోనా వైరస్ కట్టడిలో ట్రంప్ విఫలమయ్యారని ఎక్కువ మంది అమెరికన్లు భావిస్తున్నట్లు సర్వేల్లో వెల్లడైంది. దీంతో తన మద్దుతుదారులనే ట్రంప్ నమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 12 నుంచి 15 వరకు నిర్వహించిన ఈ సర్వేలో... ట్రంప్‌కు 40 శాతం మద్దతు తెలపగా... బైడెన్‌కు 55 శాతం మంది మద్దతిచ్చారు. ఇదే విభాగంలో మార్చిలో ట్రంప్‌పై... రెండు పాయింట్లు మెరుగ్గా ఉన్న బైడెన్... మే నాటికి 10 పాయింట్లతో ఆధిక్యంలోకి దూసుకెళ్లారు.
బైడెన్ బెస్ట్