తెలంగాణ

telangana

ETV Bharat / international

'ట్రంప్.. ఇప్పటికైనా ఓటమిని ఒప్పుకో' - బరాక్ ఒబామా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓటమిని అంగీకరించాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ అధ్యక్షుడు ఒబామా అన్నారు. బైడెన్​ స్పష్టమైన విజయం సాధించారని, ట్రంప్​ కోర్టులను ఆశ్రయించినా ఫలితాల్లో తేడా ఉండే అవకాశమే లేదని చెప్పారు.

It is time for Trump to concede: Obama
'ట్రంప్.. ఇప్పటికైనా ఓటమిని ఒప్పుకో'

By

Published : Nov 16, 2020, 12:10 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయానని డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికైనా ఒప్పుకోవాలన్నారు మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామా. ఎన్నికల ఫలితాలు మారే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. జో బైడెన్ స్పష్టమైన మెజారిటీ సాధించారని చెప్పారు. సీబీఎన్​ఎస్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై ఒబామా మాట్లాడారు.

" బైడెన్ చేతిలో ఓటమిపాలైనట్లు ట్రంప్ అంగీకరించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎన్నికలు పూర్తైన మరునాటి నుంచి ఇప్పటివరకు గమనించినా బైడెన్​ స్పష్టమైన మెజారిటీతో గెలిచినట్లు అర్థమవుతోంది. ఎన్నికల ఫలితాలు మారే అవకాశాలే లేవు. అంత తక్కువ వ్యత్యాసం కూడా లేదు. మీ గడువు పూర్తయినప్పుడు అహాన్ని పక్కనపెట్టి దేశానికే ప్రాధాన్యం ఇవ్వాలి. అమెరికా భద్రత, నిఘాకు సంబంధించిన విషయాలను బైడెన్​తో పంచుకోవాలి. 2016లో ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు ప్రభుత్వం ఆయనతో ఈ విషయాలను పంచుకున్న విషయం గుర్తుంచుకోవాలి. ట్రంప్ అందరు అధ్యక్షులలాగే వ్యవరించాలి. ఆయన మిగతావారికంటే ప్రత్యేకం ఏమీ కాదు."

-బరాక్ ఒబామా, అమెరికా మాజీ అధ్యక్షుడు.

ఇటీవల జరిగిన అగరాజ్యం అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల అభ్యర్థి జోబైడెన్​ 306 ఎలక్టోరల్ ఓట్లు సాధించి స్పష్టమైన మోజారిటీతో గెలిచారని అమెరికా మీడియా తెలిపింది. ట్రంప్ కేవలం 232 ఎలక్టోరల్ ఓట్లే గెలిచారని పేర్కొంది. అయితే ట్రంప్ మాత్రం ఓటమిని అంగీకరించడం లేదు. ఎన్నికల్లో మోసాలు జరిగాయని నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ఫలితాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పెన్సిల్వేనియా, నెవాడా, మిషిగన్, జార్జియా, అరిజోనా కోర్టులను ఆశ్రయించారు. విస్కాన్సిన్​లో రీకౌంటింగ్​కు డిమాండ్ చేస్తున్నారు. అధికార మార్పిడి ప్రక్రియకు సహకరించడం లేదు. అమెరికా భద్రత, నిఘాకు సంబంధించిన సమాచారాన్ని బైడెన్​తో పంచుకోవడం లేదు.

ABOUT THE AUTHOR

...view details