ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా రకాల్లో అన్నింటికంటే డెల్టానే (Delta Kids covid) ప్రమాదకరమా? మరీ ముఖ్యంగా ఇతర వేరియంట్ల కంటే డెల్టా(Delta Variant news).. పిల్లలపై తీవ్ర ప్రభావం చూపనుందా? అయితే.. దీనికి అలాంటి స్పష్టమైన ఆధారాలేమీ లేవంటున్నారు నిపుణులు. డెల్టా వేగంగా వ్యాప్తి చెందుతుంది కాబట్టే.. పిల్లల్లో అంటువ్యాధులు పెరిగిపోతున్నాయని చెబుతున్నారు. అందుకే.. కరోనా (Covid Kids) బారిన కూడా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటున్నారు ఫ్లోరిడాలోని జాన్స్ హాప్కిన్స్ ఆల్ చిల్డ్రెన్స్ హాస్పిటల్ వైద్యులు డుమోయిస్.
''అత్యంత సులువుగా, వేగంగా వ్యాపిస్తుంది కాబట్టి.. డెల్టాతో (Delta variant Covid) పిల్లలకు ప్రమాదమే. ఇది పాఠశాలల్లో మాస్కుల వినియోగం ఎంత అవసరమో నొక్కి చెబుతోంది. టీకా పొందేందుకు అర్హత ఉన్నవారు.. తప్పనిసరిగా తీసుకోవాలి.''
- డా. జాన్ డుమోయిస్, పిల్లల అంటువ్యాధి నిపుణులు
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం.. డెల్టా (Delta Kids covid) వేరియంట్ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 180 దేశాలకు విస్తరించింది. చాలా దేశాల్లో ఆస్పత్రిలో చేరే.. చిన్న పిల్లలు (Delta Kids covid), టీనేజీ యువత సంఖ్య బాగా పెరిగింది.
అమెరికాలో ఈ నెల మొదటి వారంలోనే 2 లక్షల 50 వేల మందికిపైగా పిల్లలు (Covid Kids) కరోనా బారినపడ్డారు. ఇది గత శీతాకాలంలో గరిష్ఠస్థాయిలో వెలుగుచూసిన ఇన్ఫెక్షన్ల కంటే అధికం. అమెరికాలో మొత్తంగా.. 50 లక్షల మందికిపైగా పిల్లలు మహమ్మారి బారినపడ్డారు.
లక్షలో ఇద్దరే..
అమెరికా అంటువ్యాధుల నివారణ సంస్థ(సీడీసీ) గణాంకాల ప్రకారం.. అక్కడి ప్రతి లక్ష మంది పిల్లల్లో ఇద్దరు ఆస్పత్రుల పాలవుతున్నారు. ఆ దేశంలో కరోనా కేసులు భారీగా నమోదైన సమయంలోనూ ఆస్పత్రుల చేరే వారి శాతం (Covid infection rate) దాదాపు ఇలాగే ఉంది. అయితే అప్పటితో పోలిస్తే.. బాధితులు తీవ్రంగా ప్రభావితమైనట్లు ఏమీ కనిపించలేదని స్పష్టం చేసింది సీడీసీ.