తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా వేళ ప్రజా రవాణా భద్రమేనా? - కరోనా వైరస్ భద్రతా చర్యలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా నానాటికీ విజృంభిస్తోంది. ఒకరి నుంచి మరొకరికి అత్యంత వేగంగా సంక్రమించే ఈ వైరస్ ఉద్ధృతి కొనసాగుతున్న వేళ ప్రజా రవాణా సురక్షితమేనా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? ఒకవేళ ప్రజా రవాణా వ్యవస్థను ప్రారంభిస్తే వ్యాప్తిని అడ్డుకునేందుకు ఏవైనా మార్గాలున్నాయా?

public transit
ప్రజా రవాణా

By

Published : Aug 11, 2020, 5:34 PM IST

కరోనా.. ప్రస్తుతం ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ఏడు నెలలుగా ప్రపంచమంతా ఆంక్షల ప్రయాణం సాగిస్తోంది. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో విధి లేక క్రమంగా అన్ని కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి ప్రపంచ దేశాలు.

అయితే ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందే కరోనా విజృంభిస్తోన్న వేళ ప్రజా రవాణా ఎంత వరకు సురక్షితం అన్న ప్రశ్న అందరిలో ఉంది. ఒకవేళ రవాణా వ్యవస్థను పునరుద్ధరిస్తే వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఏవైనా మార్గాలున్నాయా? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం..

ఏం చెయ్యాలి..?

మాట్లాడినా, తుమ్మినా, దగ్గినా నోటి బిందువుల ద్వారా మరొకరికి సోకుతుంది ఈ వైరస్. కరోనా వ్యాప్తికి ఇదే ప్రధాన కారణం. అందువల్ల ప్రయాణాలు చేసినప్పుడు ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ఉపయోగించి ఇన్ఫెక్షన్​ను తగ్గించవచ్చన్నది నిపుణుల అభిప్రాయం. ఇతరుల నుంచి 6 మీటర్ల దూరం పాటిస్తే సరిపోతుందని చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థ సంస్థలు కూడా ఇదే విషయాన్ని తమ ప్రయాణికులకు సూచిస్తున్నాయి. మాస్కులు, భౌతిక దూరం పాటించాలని చెబుతున్నాయి. అయితే వ్యవస్థలను బట్టి పరిస్థితులు మారుతుంటాయి. ముఖ్యంగా బస్సులు, రైళ్లలో రద్దీ అధికంగా ఉంటుంది. ఇక్కడ కూడా వైరస్ వ్యాప్తిని అదుపులో ఉంచేందుకు కొన్ని మార్గాలున్నాయని అమెరికా వ్యాధి నియంత్రణ కేంద్రాలు సూచిస్తున్నాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

  • రద్దీ అధికంగా ఉండే సమయాల్లో ప్రయాణాలు మానుకోవాలి.
  • రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో జనాలు ఎక్కువగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలి.
  • ఉపరితలాలపై వైరస్​ ఉంటుంది కాబట్టి.. ఎప్పటికప్పుడు వాటిని వివిధ పద్ధతుల్లో శుభ్రం చేయాలి.
  • సాధ్యమైనంత వరకు బస్సులు, రైళ్లలో ఉపరితలాలను తాకకుండా ఉండేందుకు ప్రయత్నించాలి.

వివిధ ప్రాంతాల్లో ఇలా..

రష్యా, చైనాలో అతినీలలోహిత కిరణాలను ఉపయోగించి క్రిములను సంహరించే ప్రయత్నాలు చేస్తున్నారు. హాంకాంగ్​లో హైడ్రోజన్ పెరాక్సైడ్​ను చల్లే రోబోలను వినియోగిస్తున్నారు. న్యూయార్క్​లో సబ్​వేలను శుభ్రం చేసేందుకు రాత్రివేళల్లో మూసివేస్తున్నారు.

వైరస్ ఎవరి నుంచి ఎలా వ్యాపిస్తుందో తెలియదు. అయితే ఇప్పటివరకు రవాణా వ్యవస్థలకు సంబంధించి భారీ వ్యాప్తి జరగలేదని నిపుణులు అంటున్నారు.

ఇదీ చూడండి:70 శాతానికి చేరువలో కరోనా రికవరీ రేటు

ABOUT THE AUTHOR

...view details