తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆపరేషన్​ 'సాగర్'​: బాగ్దాదీకీ లాడెన్​ గతే..! - అమెరికా అధికారులు

అమెరికా​ బలగాల దాడి నేపథ్యంలో ఆత్మాహుతి చేసుకొని చనిపోయిన ఉగ్ర సంస్థ ఇస్లామిక్​ స్టేట్​ అధిపతి అబు బకర్​ అల్​ బాగ్దాదీ అవశేషాలను సముద్రంలో పడేసినట్లు అధికారులు తెలిపారు. గతంలో ఆల్​ఖైదా ఉగ్రవాద నాయకుడు బిన్​లాడెన్​ శవాన్ని ఇలానే సాగరంలో వేశారు అధికారులు.

ఆపరేషన్​ 'సాగర్'​: బాగ్దాదీకీ లాడెన్​ గతే..!

By

Published : Oct 29, 2019, 5:17 PM IST

ఆత్మాహుతి దాడిలో ఛిద్రమైన కరడుగట్టిన ఉగ్ర సంస్థ ఇస్లామిక్​ స్టేట్​ అధిపతి అబు బకర్​ అల్​ బాగ్దాదీ అవశేషాలను సముద్రంలో గుర్తు తెలియని చోట పడవేసినట్లు అమెరికా సైనిక అధికారులు వెల్లడించారు. 2011లో లాడెన్​ మృతదేహాన్ని కూడా సముద్రంలోనే వేశారు.

సిరియా ఇడ్లిబ్ రాష్ట్రంలోని బరీష్ గ్రామంలో బాగ్దాదీ ఉన్నట్లు తెలుసుకుని గతవారం అమెరికా బలగాలు అతడి స్థావరంపై దాడి చేశాయి. విధిలేక ఓ సొరంగంలో ఆత్మాహుతి దాడి చేసుకున్నాడు బాగ్దాదీ. మృతదేహానికి అమెరికా సైనిక అధికారులు డీఎన్​ఏ పరీక్షలు చేయించారు. బాగ్దాదీ హతంపై గతంలో అనేకసార్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో అతడి మరణాన్ని ధ్రువీకరించేందుకు ఈ పని చేశారు.

కీలక పాత్ర పోషించిన శునకం...

అల్​ బాగ్దాద్​ చివరి క్షణాల వరకు అమెరికా సైన్యానికి చెందిన ఓ శునకం తరిమి తరిమి వెంటాడింది. సొరంగం చివరకు వెళ్లిన అతడిపై జాగిలం దాడి చేసింది. అతడు చివరికి ఆత్మాహుతి చేసుకునే వరకు వెంటాడింది. ఈ వేటలో ఆ శునకానికి స్వల్పగాయాలయ్యాయి. చికిత్స అనంతరం తిరిగి విధుల్లో చేరింది ఆ శునకం.

ఇదీ చూడండి:తల్లిదండ్రులు టీవీలో బిజీ- తొట్టిలో పడి చిన్నారి మృతి

ABOUT THE AUTHOR

...view details