తెలంగాణ

telangana

ETV Bharat / international

'సైనిక చర్యలకు పాల్పడితే.. యుద్ధమే' - సౌదీ అరేబియా

అమెరికా, సౌదీ అరేబియాలు... ఇరాన్​పై సైనిక చర్యకు పాల్పడితే, అది తీవ్ర యుద్ధానికి దారితీస్తుందని ఆ దేశ విదేశాంగమంత్రి మొహమ్మద్ జావెద్​ పేర్కొన్నారు. తాము యుద్ధాన్ని కోరుకోవడంలేదని, దాడులు చేస్తే మాత్రం తిరుగుబాటు తప్పదని స్పష్టం చేసింది.

'సైనిక చర్యలకు పాల్పడితే..అది యుద్ధానికి దారితీస్తుంది'

By

Published : Sep 20, 2019, 5:21 AM IST

Updated : Oct 1, 2019, 7:02 AM IST

'సైనిక చర్యలకు పాల్పడితే.. యుద్ధమే'

ఇరాన్​పై అమెరికా, సౌదీ అరేబియాలు సైనిక చర్యకు పూనుకుంటే అది తీవ్ర యుద్ధానికి దారితీస్తుందని ఆ దేశ విదేశాంగమంత్రి మొహమ్మద్​ జావెద్​ జారిఫ్​ హెచ్చరించారు.

"మేము యుద్ధాన్ని కోరుకోవడంలేదు. యుద్ధమే వస్తే అది భారీ ప్రాణ నష్టానికి దారితీస్తుంది. కానీ మా దేశాన్ని రక్షించుకునే విషయంలో వెనకడుగు వేసేది లేదు."-మొహమ్మద్​ జావెద్​, ఇరాన్ విదేశాంగమంత్రి

దాడులు చేసింది ఎవరు?

ఆరాంకో చమురు క్షేత్రాలపై దాడికి పాల్పడింది తామేనని యెమెన్​కు చెందిన హుతీ తిరుగుబాటుదారులు ప్రకటించుకున్నారు. అయితే డ్రోన్ దాడులకు పాల్పడింది ఇరానేనని అమెరికా ఆరోపిస్తోంది. ఇరాన్ తన భూభాగం నుంచే క్రూయిజ్ మిసైల్స్​ను ప్రయోగించిందని శ్వేతసౌధం అంటోంది. అయితే అమెరికా, సౌదీ ఆరోపణలను ఇరాన్ ఖండించింది. తాము దాడులు చేయలేదని ప్రకటించింది.

శాంతియుత పరిష్కారం

గల్ఫ్​ తీరంలో ఉద్రిక్తతలు రూపుమాపడానికి ఇరాన్​తో శాంతి చర్చలు జరిపేందుకు ఆమెరికా సిద్ధంగా ఉందని ఆ దేశ విదేశాంగమంత్రి మైక్​ పాంపియో తెలిపారు. తమపై సైనిక చర్యలు తీసుకుంటే.. అది తీవ్రయుద్ధానికి దారితీస్తుందన్న ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో పాంపియో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇదీ చూడండి: కేంద్రమంత్రిని అడ్డుకున్న వామపక్ష విద్యార్థి సంఘాలు

Last Updated : Oct 1, 2019, 7:02 AM IST

ABOUT THE AUTHOR

...view details