Iran US Nuclear Deal: ఇరాన్ అణు కార్యక్రమానికి అడ్డంకిగా ఉన్న పలు ఆంక్షలను బైడెన్ సర్కార్ ఎత్తివేసింది. 2018లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ అణు ఒప్పందం నుంచి వైదొలిగిన అనంతరం ఆంక్షలు విధించారు. ఇటీవలే ఇరాన్ పౌర అణు కార్యకలాపాలకు సంబంధించి విధించిన అనేక ఆంక్షలను మినహాయిస్తూ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సంతకం చేశారు. ఈ నిర్ణయం వల్ల ఇరాన్ అణు కార్యక్రమాలకు సహకరించే దేశాలు, కంపెనీలపై అమెరికా విధించే జరిమానాల నుంచి మినహాయింపు లభించనుంది.
ఇరాన్‌పై ఆంక్షల ఎత్తివేత.. బైడెన్ సర్కారు కీలక నిర్ణయం - అమెరికా
Iran US Nuclear Deal: ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని పునరుద్ధరించే దిశగా అమెరికా చర్యలు ప్రారంభించింది. ఈ నిర్ణయం వల్ల ఇరాన్ అణు కార్యక్రమాలకు సహకరించే దేశాలు, కంపెనీలపై అమెరికా విధించే జరిమానాల నుంచి మినహాయింపు లభించనుంది.
Iran US Nuclear Deal
ఇరాన్‌తో తిరిగి అణు ఒప్పందం చేసుకోవటానికి మద్దతు చాలా కీలకమన్న అమెరికా అధికారులు.. ఆ దేశానికి ఎలాంటి రాయితీలు ఇవ్వలేదన్నారు. అయితే ఇరాన్ అణు ఒప్పందం విషయమై ఇతర దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, యూరోపియన్ యూనియన్, చైనా, రష్యాలను ఒప్పించటానికి ఈ మినహాయింపులు తప్పనిసరి అని అమెరికా అధికారులు స్పష్టంచేశారు.